
జిరసం అధ్యక్షుడిగా ‘కొత్తపల్లి’
అనంతపురం కల్చరల్: జిల్లా రచయితల సంఘం (జిరసం) నూతన కార్యవర్గాన్ని స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ శాంతినారాయణ, సీనియర్ కవి డాక్టర్ రాధేయ, ఉప్పరపాటి వేంకటేశుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ జెన్నె ఆనంద్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడిగా వర్ధమాన కవి కొత్తపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శిగా వన్నప్ప, కోశాధికారిగా మధురశ్రీను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సీనియర్ రచయితలు అభినందించారు. కార్యక్రమంలో జిరసం ప్రతినిధులు విద్యావతి, గోసల నారాయణస్వామి, ఎల్‌ఆర్ వెంకటరమణ, డాక్టర్ అంకె శ్రీనివాస్, చేగువేరా హరి, ఒంటెద్దు రామలింగారెడ్డి, విశ్వనాథరెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
89 మంది కానిస్టేబుళ్ల బదిలీ
అనంతపురం: సీనియార్టీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి 89 మంది కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో చేపట్టిన ఈ ప్రక్రియను అడిషనల్ డీఎస్పీ డీవీ రమణమూర్తి, ఏఓ రవిరాం నాయక్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు.