
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా సోమవారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా రాత్రి 9 గంటల సమయానికి 11,50,911 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో లక్షా 90 వేల మందికి టీకాలు వేశారు. గత నెలలో 13.72 లక్షల మందికి ఒకే రోజు టీకాలు వేసిన విషయం విదితమే.
1,627 మందికి పాజిటివ్
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 57,672 టెస్టులు చేయగా 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజులో 2017 మంది కోలుకోగా, 17 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ 2,41,92,633 టెస్టులు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392కి చేరింది. కాగా వీరిలో 19,21,371 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 13,273కి చేరాయి. యాక్టివ్ కేసులు 21,748 ఉన్నాయి.