సాక్షి, పశ్చిమగోదావరి : వరద ముంపు బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఉండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. బాధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్ ముత్యాల రాజు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరిలో లాంచ్‌లో వెళ్లి వరద బాధిత ప్రజలను పరామర్శించారు. జోరు వర్షంలోనే ముంపు గ్రామాల బాధితుల సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ('అది టీడీపీ కాదు.. ట్విటర్ జూమ్ పార్టీ')
ఆళ్ల నాని మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇప్పటికే అందించినట్లు తెలిపారు. ఒకరికి అయిదు కేజీల బియ్యం, కుటంబానికి కిలో కంది పప్పు, నూనె, అయిదు రకాల నిత్యావసర వస్తువుల అందజేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. అంటు వ్యాధులు రాకుండా శానిటేషన్ చేశారని, పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, డాక్టర్లను అందుబాటులో ఉంచామని.. అందరి సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని పేర్కొన్నారు. (ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని)
నిత్యావసర వస్తువులు అందించాం
వరదపై ముందుగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలకు వరద వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారని, వరద వలన నష్టపోయిన ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల అందించామన్నారు. ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. మళ్ళీ వర్షాలు పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఎన్ని మంచి పులు చేసిన విమర్శించడం టీడీపీకి అలవాటు అయ్యిందని మండిపడ్డారు. వారు పనులు చేయరు.. చేసిన వారిపై విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు విమర్శలు చేయడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. (నవరత్నాల అమలులో మరో ముందడుగు)
వరద బాధితులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. వరదకు ముందుగానే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించామన్నారు.మళ్ళీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. చంద్రబాబు నిర్వహకం వలనే గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కంటే ముందుగా కాపర్ డ్యామ్ నిర్మించడం వలన తరుచూ గ్రామాలు మునిగిపోతున్నాయని విమర్శించారు. (గోదావరి ఉధృతి.. అధికారులు అప్రమత్తం)
Comments
Please login to add a commentAdd a comment