
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ. షరీఫ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్ కోవిడ్ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment