విజయవాడలోని నిర్మల్ హృదయ్ భవన్‌లో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు మంగళవారం విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు. నిర్మల్ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సీఎం ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల్ హృదయ్ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికారు. నిర్మల్ హృదయ్ భవన్‌లో చిన్నారులు సెబాస్టియన్, మేఘన ముఖ్యమంత్రి దంపతుల వెంట ఉన్నారు. చిన్నారులు ముందుండి సీఎం జగన్ దంపతుల చేయి పట్టుకుని నడిపించారు.
అనంతరం ఆశ్రమంలోని మదర్ థెరిస్సా చిత్రపటానికి సీఎం జగన్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రూహుల్లా, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళలకు జగనన్న ఇస్తున్న ఆసరా
Comments
Please login to add a commentAdd a comment