
సాక్షి, అమరావతి: దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయమే ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వ పధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.
వాయు కాలుష్యం పెరగడం వల్ల కోవిడ్ ప్రభావం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని, దీన్ని నియంత్రించేందుకే కేవలం రెండు గంటల సమయం ఇచ్చినట్టు ఈనెల 5న నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు రెండు గంటల సమయం ఇచ్చామని, టపాసులు అమ్మే షాపులు కూడా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. షాపుల ముందు క్యూలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్లు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment