బీసీ కోటాలో తనకే మంత్రి పదవి అంటున్న అనగాని
తనకు మాట ఇచ్చారంటున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి
ఎస్సీ కోటాలో మంత్రిని నేనేనంటూ నక్కా ఆశాభావం
తనకే మంత్రి పదవి అంటున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి
ఎవరికి వారు ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసింది.. ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇంక మంత్రి పదవులకోసం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. కొందరు లోకేష్ మెప్పుకోసం తంటాలు పడుతుంటే.. మరికొందరు చంద్రబాబును ప్రభావితం చేసేందుకు సకల యత్నాలు సాగిస్తున్నారు. మొత్తంగా తమకే మంత్రి పదవి వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనుండటంతో జిల్లానుంచి మంత్రి పదవి ఎవరిని వరిస్తోందోనని ఆ పారీ్టనేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తనకే మంత్రి పదవి అంటున్న పర్చూరు ఎమ్మెల్యే..
తాను కూడా మంత్రి రేస్‌లో ఉన్నట్లు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏలూరి సాంబశివరావు వరుసగా మూడవసారి పర్చూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు, లోకేష్‌లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి పారీ్టలో ఉన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరిలు ఇద్దరూ చంద్రబాబు సామాజికవర్గంవారే. దీంతో ఇద్దరిలో ఒకరికే మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశముంది. గొట్టిపాటి గత ఎన్నికల ముందు మాత్రమే టీడీపీలో చేరారని, ఆ పరంగా చూసినా ఆది నుంచి పారీ్టలో ఉన్న ఏలూరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు లెక్కలు వేస్తున్నారు. పైగా లోకేష్ నుంచి హామీ వచ్చినట్లు ఆయన అనుచరగణం చెబుతుతోంది. మొత్తంగా తనకు మంత్రి పదవి దక్కనుందని ఏలూరి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందో వేచిచూడాల్సివుంది.
మంత్రి రేస్‌లో గొట్టిపాటి..
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత చంద్రబాబు, లోకే‹Ù ఒత్తిళ్లతో ఆ పారీ్టనివీడి టీడీపీలో చేరారు. అద్దంకి నుంచి 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు, లోకే‹Ùలతో సత్సంబంధాలు నెరిపారు. అధికారంలోకి రాగానే గొట్టిపాటిని మంత్రిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో లోకేష్ చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన హామీ మేరకు తనకే మంత్రిపదవి దక్కనుందని గొట్టిపాటితోపాటు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఈమేరకు చంద్రబాబు మంత్రివర్గంలో గొట్టిపాటికి స్థానం దక్కనుంది.
బీసీ కోటాలో అనగానికి..?
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనగాని ఆది నుంచి టీడీపీలో ఉన్నారు. పైగా 2014, 2019, 2024లలో వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఈ దఫా బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ బాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారని ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చసాగుతోంది. అనగానికి మంత్రి పదవి ఖాయమైందని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు.
మొత్తంగా జిల్లా నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం మంత్రాంగం నడిపిస్తున్నా.. అటు అనగాని సత్యప్రసాద్‌కు, ఇటు గొట్టిపాటి రవికుమార్‌కు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే చివరకు రేస్‌లో ఎవరు ముందుంటారో? వేచి చూడాల్సివుంది.
మంత్రి పదవి కోసం నక్కా ప్రయత్నాలు
వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశముందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నక్కా ఆనందబాబు మొదటినుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో వేమూరునుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున చేతిలో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున గెలుపొందారు. దీంతో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే నక్కా ఆనందబాబుకు గతంలో మంత్రిగా అవకాశం కలి్పంచిన నేపథ్యంలో ఈ దఫా ఆయనకు మంత్రి వర్గంలో స్థానం లేదన్న ప్రచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment