సాక్షి, అనంతపురం : పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యానారాయణ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీకి అంగీకరించారని ఆయన అన్నారు. పోలవరంపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆయన సోమవారం రోజున మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం పూర్తి చేసి తీరుతామని అన్నారు. ప్రతి విషయాన్ని వక్రీకరించడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలతో బకాయిపెట్టిన 2300 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారని మంత్రి బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ రైతు ద్రోహి అని ఆయన మండిపడ్డారు. (విద్యార్థుల చదువులు ఆనందంగా సాగాలి: సీఎం జగన్)
కోవిడ్ పేరుతో దోపిడీ చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. రోగులను ఇబ్బందులు పెట్టే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అనుమతులు రద్దు చేస్తామన్నారు. హంద్రీనీవా నీటి పంపకాలపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని, చెరువులు, ఆయకట్టుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని మంత్రి బొత్స సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment