AP-WRD: CM YS Jagan Review Meeting On Water Resources Department - Sakshi
Sakshi News home page

WRD: జలవనరుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. వలసల నివారణకు ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

Published Tue, May 10 2022 2:09 PM | Last Updated on Tue, May 10 2022 8:51 PM

CM YS Jagan Review Meeting On Water Resources Department - Sakshi

సాక్షి, అమరావతి: జలవనరుల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష చేపట్టారు.  గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా.. అధికారులు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు నివేదించారు.

పోలవరంపై..

► పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా పనులు సాగుతున్నాయని సీఎం జగన్‌కు వివరించారు అధికారులు. 
► ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయ్యాయి. 
దిగువ కాఫర్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుకతో నింపేందుకు అన్నిరకాల ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికోసం 76 శాతం జియో బ్యాగులతో ఇప్పటికే నింపామన్న అధికారులు. 
దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లపై ఇన్వెస్టిగేషన్‌ పూర్తయ్యిందని, ఈనెలాఖరు నాటికి డిజైన్లపై స్పష్టత వస్తుందని తెలిపారు. 
పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రీయంబర్స్‌ చేయాల్సిన డబ్బు రూ. 2,559.37 కోట్లు. 
వీలైనంత త్వరగా డబ్బును తెప్పించుకునే ప్రయత్నాలు చేయాలన్న సీఎం. 
పీపీఏ అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రతి పనీ జరుగుతుందని తెలిపారు.
పనులు వేగంగా పూర్తిచేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తన డబ్బు ఖర్చు చేస్తోంది.
చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రీయంబర్స్‌ జరిగేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులతో చెప్పారు. 
అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశంలో రీయంబర్స్‌ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులకు  సీఎం జగన్‌ సూచించారు.

నెల్లూరు, సంగం బ్యారేజీ పనుల పురోగతి

► నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సకాలంలో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. 

► అవుకు టన్నెల్‌ పనులపైనా సమీక్ష జరగగా.. పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

వెలిగొండ ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించిన అధికారులు

2014–19 మధ్య గత ప్రభుత్వ హయాంలో టన్నెల్‌ –1 కు సంబంధించి కేవలం 4.33 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. అంటే రోజుకు కేవలం 2.14 మీటర్ల పనిమాత్రమే గత ప్రభుత్వ హయాంలో సాగింది.

2019 – 2022 వరకు కేవలం మూడేళ్ల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన పని 2.8 కిలోమీటర్లు. అంటే రోజుకు 4.12 మీటర్ల మేరకు టన్నెల్‌ పనులు జరిగాయి.

టన్నెల్‌ –2 కు సంబంధించి 2014–2019 మధ్యలో రోజుకు 1.31 మీటర్ల పని జరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 2019–22 మధ్య కాలంలో రోజుకు 2.46 మీటర్లు పని జరిగింది.

ప్రస్తుతం వెలిగొండలో నెలకు 500 మీటర్లపైన పని జరుగుతోంది.

సెప్టెంబరులో టన్నెల్‌–1 ద్వారా నీటి విడుదలకు అధికారుల ధీమా.
టన్నెల్‌–1 ద్వారా నీటిని పంపిస్తున్న సందర్భంలోనే టన్నెల్‌–2లోనూ కొనసాగనున్న పనులు. జూన్, 2023 నాటికి టన్నెల్‌ –2 పనులు పూర్తి.
ఈలోగా పునరావాస కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు.  

ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులపైనా సమీక్ష

వంశధార నిర్వాసితుల కోసం అదనపు ఎక్స్‌ గ్రేషియా పైన సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

దాదాపు రూ.226.71 కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చిస్తోంది ప్రభుత్వం.

నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ఈ చెల్లింపులు చేస్తున్నామని సీఎం జగన్‌.. వెల్లడించారు. 

నిధులు మంజూరుచేస్తూ మార్చిలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయన్న అధికారులు.

► గొట్టా బ్యారేజీ వద్ద లిఫ్ట్‌ పెట్టి.. దానిద్వారా హీరమండలం రిజర్వాయర్‌ నింపే ప్రతిపాదనకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌. దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. 

నేరడి బ్యారేజీ నిర్మాణం అంశంపైనా కూడా దృష్టిపెట్టాలని ఆదేశాలు. 

గజపతినగరం బ్రాంచ్‌  కెనాల్, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్‌. 

రాయలసీమ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష

తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఉన్న కర్నూలు పశ్చిమ  ప్రాంతంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు. 

► నీటి కొరత కారణంగా ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని.. వాటిని నివారించాలని సీఎం జగన్‌ అధికారులతో చెప్పారు. 

► సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని.. తద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో వలసలు నివారించడానికి ఈ ప్రాజెక్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

 చిత్తూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు తాగు, సాగునీటిని అందించాలని సీఎం జగన్‌ ఆదేశం.  కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు.

► మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం జగన్‌.. ఆయా ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. 

► భైరవానితిప్ప ప్రాజెక్టు, మడకశిర బైపాస్‌ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌ –2 (కోడూరు వరకు), జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, ఉత్తరాంధ్ర  సుజల స్రవంతి, రాయలసీమ లిప్ట్‌ స్కీం, ఎర్రబాలి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నుంచి యూసీఐఎల్‌ సప్లిమెంట్, రాజోలి, జలదిరాశి రిజర్వాయర్లు(కుందూ నది), రాజోలి బండ డైవర్షన్‌ స్కీం, వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం – 5 లిప్ట్‌ స్కీంలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న సీఎం 


ఈ సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, జలవనరులశాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement