తిరుపతి తుడా: యూకే నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అతన్ని తిరుపతి రుయా పరిధిలోని ఆర్‌సీహెచ్ సెంటర్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మిట్టూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గత నెల 21న యూకే నుంచి ఇండియాకొచ్చాడు. ఇండియాకు వచ్చే సమయంలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ రావడంతో అనుమతిచ్చారు. ఈ నెల 7వ తేదీన తిరిగి యూకే వెళ్లే నిమిత్తం నాలుగు రోజుల కిందట తిరుపతి స్విమ్స్‌లో పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. మరోసారి ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోసారి స్వాబ్ సేకరించి కరోనా కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ కోసం పూణేలోని సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. దీనిపై డీఎంహెచ్‌వో డాక్టర్ పెంచులయ్య మాట్లాడుతూ కొత్త స్ట్రెయిన్ కాకపోవచ్చని, స్థానికంగా ఉన్న కరోనా వైరస్ కారణం అయి ఉండొచ్చని తెలిపారు.
ఏపీలో 128 మందికి పాజిటివ్
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 29,714 పరీక్షలు చేయగా, 128 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు 1,20,02,494 మందికి పరీక్షలు చేశారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,210కి చేరింది. ఒక్కరోజులో 252 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,73,149కి చేరింది. తాజాగా ముగ్గురి మృతితో మొత్తం మరణాలు 7,118కి చేరాయి. యాక్టివ్ కేసులు 2,943 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment