సాక్షి, విజయవాడ : రైతుభరోసా కేంద్రాలలో ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలుచేశారు. దీని ద్వారా రైతులు నేటినుంచి తమకు కావాల్సిన ఉత్పాదకాలు. ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేయోచ్చు. డిజిటల్ విధానంలో చెల్లింపు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ అగ్రోస్ సంస్థ నేటినుంచి సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి సూచన మేరకు నగదు చెల్లింపులతో పాటు డిజిటల్ విధానంలో కూడా రైతులు చెల్లిపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రైతులు నేరుగా భీం, గూగుల్ పే, పేటియం, ఫోన్ పే వంటి డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపి తమకు కావాల్సినవి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. .
Comments
Please login to add a commentAdd a comment