
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. (చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ)
దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు.
చదవండి:
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి
Comments
Please login to add a commentAdd a comment