
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ గా జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.
స్వాతంత్య్ర ఫలాలను ఆస్వాదించడానికి మనకు మార్గం సుగమం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధులందరినీ స్మరించుకునేది ఈ రోజు అన్నారు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలను ప్రతిష్టించిన రోజు ఇదేనని తెలిపారు. ఈ రోజున జాతి నిర్మాణానికి అంకితమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment