మృతి చెందిన అబ్దుల్ రజాక్, షేక్ గౌసియా దంపతులు
అనంతపురం క్రైం: కోవిడ్ మహమ్మారి బంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చేస్తూ కన్నీళ్లు పెట్టిస్తోంది. పగ వారికి కూడా ఇంతటి కష్టం రాకూడదు అనుకునేంతటి పరిస్థితి నెలకొల్పుతోంది. అనంతపురం నగరంలో అటువంటి దయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని హౌసింగ్ బోర్డులో నివాసముండే మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ కరోనా కోరలకు చిక్కి వారం క్రితమే ప్రాణాలు వదిలారు. వైరస్ బారిన పడిన ఆయన భార్య షేక్ గౌసియా కూడా తాజాగా బుధవారం మృత్యువాత పడింది. (మురుగు నీటిలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు)
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు షేక్ అర్షద్, షేక్ షబ్నం. షబ్నం దుబాయ్‌లో ఉంటోంది. అర్షద్ ఇంటి వద్దే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కూతురు దుబాయ్‌లో ఉండడంతో తల్లిదండ్రుల కడసారి చూపులకు నోచుకోలేదు. కోవిడ్ ఎంతపని చేసింది భగవంతుడా అంటూ కుమారుడు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. (పేద దేశాలకూ టీకా అందాలి)
Comments
Please login to add a commentAdd a comment