
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్
🔸 ఐటీ, దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
🔸 తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్ధ్యంతో మొదలుపెట్టి, క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలకు విస్తరించనున్నారు.#Infosys #CmYsJagan #BeachIT #VizagITHub pic.twitter.com/AYxUdnGb7e
— Gudivada Amarnath (@gudivadaamar) September 27, 2022