
ఎన్టీఆర్,సాక్షి: రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని తెలిపారు. రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై కృష్ణా జిల్లా చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు భగ్గుమన్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తన రక్షణ కావాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment