బిజినెస్‌ ఉమెన్‌ | The number of women entrepreneurs has increased significantly | Sakshi
Sakshi News home page

బిజినెస్‌ ఉమెన్‌

Published Mon, Jul 29 2024 5:40 AM | Last Updated on Mon, Jul 29 2024 5:40 AM

The number of women entrepreneurs has increased significantly

వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహంతో ఏపీలో మూడేళ్లలోనే 2.28 లక్షల మహిళా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు

2023–24 సంవత్సరంలోనే 1.22 లక్షల యూనిట్ల ఏర్పాటు

రాజ్యసభలో కేంద్ర మంత్రి జితిన్‌ రాం మాంజీ వెల్లడి

సాక్షి, అమరావతి: గడిచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామి­క­వే­త్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–23 మధ్య కాలంలో కొత్తగా 2,28,299 మంది మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి జితిన్‌ రాం మాంజీ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021–22లో రాష్ట్రంలో 34,625 యూనిట్లు, 2022–23లో 70,811 యూనిట్లు, 2023–24లో 1,22,863 యూనిట్లు కొత్తగా ఏర్పాటయినట్లు వెల్లడించారు.

మూడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 46,91,577 మహిళా యూనిట్లు ఏర్పాటయితే అందులో రాష్ట్రానికి సంబంధించి 2,28,299 ఉన్నాయి. మహిళ­లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడా­నికి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో భారీగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. 

దేశవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో 19,30,188 మహిళా యూనిట్లకు రూ. 94,296 కోట్ల రుణాలను అందించారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి రాష్ట్రంలో మొత్తం ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1.96 లక్షలుగా ఉంటే ఇప్పుడు వీటి సంఖ్య 8.89 లక్షలకు చేరింది. కేవలం ఎంఎస్‌ఎంఈల ద్వారా రాష్ట్రంలో 22 లక్షల మందికిపైగా ఉపాధి లభించినట్లు అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement