పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి | Penugonda Former MLA China babu Passes Away | Sakshi
Sakshi News home page

పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి

Sep 3 2020 10:58 AM | Updated on Sep 3 2020 11:01 AM

Penugonda Former MLA China babu Passes Away - Sakshi

పెనుగొండ(ప.గో): పెనుగొండ మాజీ ఎమ్మెల్యే,  వైఎస్సార్‌సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న చినబాబు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు ఇక లేరన్న వార్తతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది.

1999లో పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు. వైఎస్పార్‌సీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్‌గా చినబాబు పనిచేశారు. కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement