29న విశాఖకు ప్రధాని మోదీ రాక | PM Narendra Modi to visit Visakhapatnam on November 29 | Sakshi
Sakshi News home page

29న విశాఖకు ప్రధాని మోదీ రాక

Published Sun, Nov 24 2024 5:21 AM | Last Updated on Sun, Nov 24 2024 5:21 AM

PM Narendra Modi to visit Visakhapatnam on November 29

సాక్షి, విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 29న విశాఖ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏయూ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖ నుంచే వర్చువల్‌ విధానంలో అచ్యుతాపురం మండలం పూడి­మడక వద్ద సింహాద్రి ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజె­క్టుకు, పాయకరావుపేటలో ఫార్మా ఎస్‌ఈజె­డ్‌లో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేస్తారు.

ఈ నేప­థ్యంలో ఏయూలో జరగాల్సిన బీఈ–­బీటెక్‌ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌­ప్రసాద్‌ విశాఖలో సమీక్షించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement