
సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అగ్నిప్రమాదం ఘటనలో జైల్లోలో ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నుంచి మరికొన్ని విషయాలు సేకరించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ మూడవ ఏసీఎమ్ఎమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి నిందితుల తరుపున న్యాయవాది కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. (రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు)
కాగా స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. (స్వర్ణ ప్యాలెస్ రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తం)
Comments
Please login to add a commentAdd a comment