ఒక్కో తప్పుడు కథనంతో ఒక్కరినైనా నమ్మిద్దామని కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు రోజుకోరీతిన గాలి వార్తలు అచ్చేస్తున్నారు. రాష్ట్రంలో సరిగ్గా ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే తాజాగా విషం కక్కుతూ ఓ కథనాన్ని వండివార్చారు.
అవునులే.. బయటకు వస్తే దొరికిపోతాననుకునే మీకు ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయనేది కరెక్ట్‌గా ఎలా తెలుస్తుంది? మీ ఆత్మీయుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో లేరన్న నిజం జీర్ణించుకోలేక గాలి రాతలతో చెలరేగిపోవడమే దిన చర్యగా మారిందన్నది నిజం కాదా రామోజీ?
సాక్షి, అమరావతి : రామోజీరావు ఎంత దిగజారి పోయా రనేది చెప్పడానికి శుక్రవారం ఈనాడులో ‘జిల్లాకో విమా నాశ్రయం ఏమైంది సారు!?’ శీర్షికన అచ్చేసిన కథనమే నిద ర్శనం. రాష్ట్రంలో ఐదుచోట్ల మాత్రమే విమానాశ్ర యాలు ఉన్నాయని, వాటిని కూడా నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ అబద్ధాలు చెప్పారు. వాస్తవంగా రాష్ట్రంలో విశాఖ పట్నం, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు.. మొత్తం ఆరు విమానాశ్రయాల్లో సర్వీసులు నడుపుతుంటే ఐదు చోట్ల నుంచి మాత్రమే విమానాలు తిరుగుతు న్నాయని రాయడం వెనుక ఉన్న మీ దుర్బుద్ధి తెలుస్తోంది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల వృద్ధిలో రాష్ట్రం దేశంలోనే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2021–22లో ఏపీలోని ఎయిర్‌పోర్టుల నుంచి 31,78,946 మంది విమానాల్లో ప్రయాణిస్తే 2022–23లో ఆ సంఖ్య 55 శాతం పెరిగి 49,27,856కు చేరింది. విమానాల సర్వీసు సంఖ్యలో కూడా 45.20 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రం నుంచి 41,179 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో ఆ సంఖ్య 59,793కి చేరింది. 2022–23లో ఏపీ మొత్తం మీద 49,27,856 మంది రాక పోకలు సాగిస్తే.. అందులో ఒక్క విశాఖ ఎయి ర్‌పోర్టు నుంచే 25,00,654 మంది ప్రయాణించారు.
ఆ తర్వాత విజయవాడ నుంచి 9.66 లక్షల మంది, తిరుపతి నుంచి 9.19 లక్షలు, రాజమండ్రి నుంచి 4.32 లక్షలు, కడప నుంచి 70,126, కొత్తగా ప్రారంభించిన కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 38,622 మంది ప్రయాణించారు. విమాన సర్వీసుల వృద్ధి పరంగా విజయవాడ ముందుంది. విజయవాడ నుంచి 2021–22లో 9,258 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో 57 శాతం వృద్ధితో 14, 593 సర్వీసులు తిరిగాయి. విశాఖ నుంచి 2021–22లో 14, 878 విమాన సర్వీసులు నడపగా.. 2022–23లో 40 శాతం వృద్ధితో 20,961 సర్వీసులు తిరిగాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విడుదల చేసిన గణాంకాలే.
గతంలో ఎదురు డబ్బులిచ్చి..
గత చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచి సింగ పూర్‌కు ఎదురు డబ్బులిచ్చి మరీ విమాన సర్వీసులు నడిపించింది. కోస్తా ప్రాంతాల నుంచి అత్యధిక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుండటంతో ప్రస్తుత ప్రభుత్వం ఎయిర్ ఇండియాతో మాట్లాడి ఎటువంటి ఎదురు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా అంతర్జాతీయ సర్వీసులను ప్రవేశపెట్టింది.
ఎయిర్ ఇండియా ప్రారంభంలో కువైట్‌కు సర్వీసులు ప్రారంభించగా, డిమాండ్ బాగుండటంతో షార్జాకు సర్వీసులు ప్రారంభించింది. రాయలసీమ ప్రజల కోసం తిరుమల నుంచి కువైట్‌కు సర్వీసు ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. విజయవాడ నుంచి కొత్తగా షిర్డీకి సర్వీసులు ప్రారంభమైతే సర్వీసులు తగ్గిపోయాయి అని ఎలా రాస్తావు?
కొత్త విమానాశ్రయాల ఏర్పాటు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త ఎయిర్‌పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గత ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించిన కర్నూలు విమానాశ్రయాన్ని సుమారు రూ.155 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. భోగాపురం విమానాశ్రయా నికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత ఇటీవల పను లు ప్రారంభించిన విషయం తెలిసిందే. 2025 నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.
కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు, దానికి అనుబంధంగా ఉండే పరిశ్రమలకు అనుకూలంగా ఉండటానికి రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించి భూ సేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ట్రస్ట్‌కు సంబంధించిన ప్రైవేటు విమానాశ్రయాన్ని పౌర సేవలకు వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ సభ్యులతో మాట్లాడుతోంది.
త్వరలో ఇక్కడి నుంచి కూడా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ విమానాశ్రయంలో 36,705 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన టెర్మినల్, రన్‌వేను 8,000 అడుగుల నుంచి 11,000 అడుగులకు విస్తరించడమే కాకుండా, కొత్తగా ఆరు విమాన పార్కింగ్ బే లను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆరు ఎయిర్‌పోర్టులకు అదనంగా మరో మూడు ఎయిర్‌పోర్టుల రాకతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment