సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో కూడా పోర్టులో రికార్డు స్థాయిలో ఎగుమతులు, దిగుమతులు జరిగినట్లు విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. విశాఖ పోర్టు వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాలుష్య నియంత్రణ కోసం మూడు లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ 72.72 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ మీదగా కొనసాగే అమ్మోనియం నైట్రేట్ వలన ప్రజలకు ఎలాంటి హానీ లేదని చెప్పారు. ఎరువుల తయారీ కోసం ఉపయోగించే ఈ అమ్మోనియం నైట్రేట్ వల్ల ప్రమాదం లేదని రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. (చదవండి: ‘కోవిడ్-19 సంక్షోభం సమసిపోలేదు’)
Comments
Please login to add a commentAdd a comment