సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. తాజాగా, సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటూరి అరెస్టులో సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఇంటూరి కుటుంబీకులు.. హైకోర్టులో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. పోలీసులపై చర్యలకు కోరుతామని వెల్లడించారు.
అరెస్టుకు ఆస్కారం లేని ఆరోపణల్లో పోలీసులు అరెస్టులకు దిగారు. వేధించాలన్న ఉద్దేశంతోనే గుడివాడ నుంచి పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం పంపించింది. పోలీసులు ఆరోపిస్తున్న పోస్టింగ్స్ కూడా ఎన్నికలకు ముందు పెట్టినవే.
అయితే, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కక్షపూరితంగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వేధింపులకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతోంది. కూటమి సర్కార్ వైఫల్యాలు ఎత్తిచూపే రవికిరణ్‌ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment