రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్–లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
► రైలు నంబర్ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
► రైలు నంబర్ 07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07492) జనవరి 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
► రైలు నంబర్ 82714 జనవరి 11న సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
కాకినాడ టౌన్ నుంచి శబరిమలకు..
శబరిమల వెళ్లే భక్తుల కోసం కాకినాడ టౌన్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైలు (07147) జనవరి 4, 11 తేదీలలో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07148) జనవరి 5, 12 తేదీలలో రాత్రి 7.00 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
కాచిగూడ–నరసాపూర్..
కాచిగూడ–నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా సువిధ ప్రత్యేక రైలు (82716) జనవరి 11న రాత్రి 11.15 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు నరసాపూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07494) జనవరి 12న సాయంత్రం 6.00 గంటలకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
Published Sat, Jan 1 2022 5:03 AM | Last Updated on Sat, Jan 1 2022 10:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment