పలాసలో వ్యానుపై క్రీడాకారుడిని ఎక్కించి ఊరేగిస్తున్న స్థానిక యువకులు
కాశీబుగ్గ: టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన యాదం సతీష్‌కుమార్ బంగారు పతకం సాధించాడు. ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్‌లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రా క్రీడాకారులకు పతకాలు లభించాయి. అందులో సతీష్ బంగారు పతకంతో మెరిశాడు.
విద్యార్థి విశాఖలోని బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పలాస. పతకం సాధించాక ఆదివారం స్వగ్రామానికి రావడంతో స్థానికులు విద్యారి్థకి ఘన స్వాగతం పలికారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రి, ఆంజనేయులు వెదురు బుట్టలు అల్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడికి దక్కిన స్వాగతం చూసి వారు ఆనందభరితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment