న్యూఢిల్లీ: ఏపీలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ రమ్మీ గేమా.. లేక అదృష్టమా నిర్ధారణకు హైకోర్టు కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
కమిటీ నివేదిక తర్వాత అన్ని విషయాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు దీనిపై ప్రభావం చూపొద్దని ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర నిబంధనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది. హైకోర్టు తుది తీర్పు మూడు వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదని తెలిపింది.
చదవండి: సీఎం జగన్ నగరి పర్యటన.. విద్యాదీవెన నిధుల విడుదల
Comments
Please login to add a commentAdd a comment