తిరుమల కాలిబాట భక్తులకు టీటీడీ విజ్ఞప్తి | TTD Appeal to Tirumala Devotees | Sakshi
Sakshi News home page

తిరుమల కాలిబాట భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Published Sat, Oct 26 2024 4:47 AM | Last Updated on Sat, Oct 26 2024 4:47 AM

TTD Appeal to Tirumala Devotees

తిరుమల: ఇటీవల కాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది.

» 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.
» ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు.
» దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. 
» కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చు. 
» తిరుమలలోని అశ్విని ఆస్పత్రి, ఇతర వైద్యశాలల్లో 24/7 వైద్య సదుపాయం పొందవచ్చు.
» దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ సౌకర్యం అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement