తిరుమలలో భక్తుల రద్దీ అప్‌డేట్‌.. నేడు గరుడోత్సవం | TTD Special Arrangements For Garudotsavam In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ అప్‌డేట్‌.. నేడు గరుడోత్సవం

Published Thu, Oct 19 2023 8:05 AM | Last Updated on Thu, Oct 19 2023 8:24 AM

TTD Special Arrangements For Garudotsavam In Tirumala - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి తొమ్మిది కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్లు. బుధవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,377గా ఉంది. 

మరోవైపు.. తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేడు ఐదవరోజుకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేరుకున్నాయి. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. నేడు గరుడోత్సవం జరుగుతుంది. గరుడోత్సవానికి తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గరుడోత్సవంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణగా లక్ష్మీ కాసులహారం, సహస్రనామ కాసుల హారం అలంకరిస్తారు. నేడు గర్భాలయం దాటి వెలుపలి రానున్న ఆభరణాలు. 

ఇదిలా ఉండగా.. గరుడోత్సవం సందర్బంగా తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు రద్దు చేశారు. ‌4000 మంది పోలీసులు, 1000 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో గరుడోత్సవానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్యాలరీలో రెండు లక్షలమంది వాహన సేవలు వీక్షించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అధిక రద్దీ వస్తే, అందరికి గరుడోత్సవ దర్శనం కల్పించేలా టీటీడీ అధికారుల చర్యలు తీసుకున్నారు. మాడవీధుల్లో ప్రత్యేక క్యూ లైన్ ద్వారా వెలుపల భక్తులు వేచి ఉన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు గరుడోత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement