
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు(శుక్రవారం) గరుడోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో అధిక సంఖ్యలో భక్తుల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు.
భక్తులకు టీటీడీ పలు సూచనలు
►ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్ ప్రాంతాల వివరాలు.
►సూచించిన ప్రాంతాలలోనే వాహనాలు పార్క్ చేసుకోవాలి.
►పార్కింగ్‌కి ముందుగా పాస్‌లు కేటాయించనున్న పోలీసులు.
►చెన్నై నుండి వచ్చే వాహనాలకు వడమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉన్న అగస్త్య ఎన్‌క్లేవ్ తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు.
►కడప నుండి వచ్చే వాహనాలకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హై స్కూల్, కరకంబాడి వద్ద ఉన్న ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాల
►చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు చంద్రగిరి సమీపంలో ఉన్న ఐతే పల్లి, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్.
►మదనపల్లి నుండి వచ్చే వాహనాలకు విధ్యానికేతన్ కాలేజి సమీపంలో ఉన్న కే.ఎం.ఎం కాలేజ్, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్.
►శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలకు రేణిగుంట సమీపంలో ఉన్న ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద, తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు
కరకంబాడి వద్ద ఉన్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పార్కింగ్ పాసులు కేటాయిస్తారు.
►జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్, భారతీయ విద్యాభవన్
►మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, ఎస్.వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌ల యందు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పార్కింగ్‌కు అనుమతి.
►అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ అనుమతి.
తిరుమలలో GNC నుండి వాహనాలు పార్కింగ్ ప్రాంతాలు..
#️⃣ VVIP పెద్ద బ్యాడ్జెస్ వాహనాలు రాంభగీచ పార్కింగ్ ప్రాంతం.
#️⃣ VIP చిన్న బ్యాడ్జెస్ వాహనాలు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్ ప్రాంతాలు.
#️⃣ సాధారణ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలకు దారి మళ్ళించబడును.
భక్తులు తమ చిన్న పిల్లలు, వృద్దులను జాగ్రత్తగా చూసుకోవాలి
►భక్తుల సౌకర్యార్థం తిరుపతి APSRTC వారు బస్ స్టాండ్ నుండే కాకుండా తిరుపతిలోని ముఖ్యమైన కూడల్ల వద్ద నుండి కూడా APSRTC బస్సులను తిరుమలకు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment