సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా మరోసారి తప్పుడు ప్రచారానికి తెర లేపింది. (రాష్ట్రం విడిపోయి తొమ్మిదిన్నరేళ్లు అయింది.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉండగా, ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇంటా బయటా అవహేళన చేస్తున్న పరిస్థితి.. అంటూ పచ్చ పత్రికల్లో విష పూరిత కథనాలు) వెలువడ్డాయి. ఇలా, పిచ్చి రాతలు రాయడానికి కొంచమైనా సిగ్గు అనిపించదా?
వాస్తవాలు ఇవే:
ఏటా రూ.70 వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాద్ లాంటి పారిశ్రామిక మహా నగరం రాజధానిగా లేకున్నా వరుసగా 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా ..
1) పెద్ద, చిన్న తరహా పరిశ్రమలు , పెట్టుబడులు
A) అక్టోబర్ నెలలో ఎక్కువ పారిశ్రామిక పెట్టుబడి సాధించిన రాష్ట్రాలలో ఏపీ 2వ స్థానం.
గుజరాత్ - రూ.25,685 కోట్లు,
ఆంధ్రప్రదేశ్ - రూ.19,187 కోట్లు
ఉత్తరాఖండ్ - రూ.10,150 కోట్లు
తమిళనాడు - రూ.7,750 కోట్లు
మహారాష్ట్ర - రూ.5,511 కోట్లు
B) పారిశ్రామిక వృద్ధిరేటు:
బాబు హయాంలో 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
C) అత్యధిక ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమలు (MSME)
బాబు హయాంలో కొత్తగా వచ్చినవి- 40 వేలు
సీఎం జగన్ హయాంలో కొత్తగా వచ్చినవి -2.5 లక్షలు
D) బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం 60 వేల కోట్లు
ఇప్పుడు సీఎం జగన్ హయాంలో రెండేళ్ళు కరోనా ఉన్నా ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు దాదాపు రూ.80వేల కోట్లు
2) విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కేటాయింపుల్లో, ఖర్చులో నంబర్ వన్ స్థానంలో ఏపీ- కాగ్
రాష్ట్రం- బడ్జెట్ కేటాయింపుల్లో వ్యయం- నిష్పత్తి
1)ఆంధ్రప్రదేశ్-72,622 కోట్లు -55.71 శాతం
2)గుజరాత్-43,107 కోట్లు -42.83 శాతం
3)కేరళ-23,313 కోట్లు -42.75 శాతం
4)తమిళనాడు-52,368 కోట్లు -42.35 శాతం
5)కర్ణాటక-39,551 కోట్లు -42.30 శాతం
6)తెలంగాణ-34,036 కోట్లు -31.34 శాతం
3) ఆస్తులు అభివృద్ధి వ్యయంలో రెండో స్థానంలో ఏపీ -కాగ్
ఆస్తుల కల్పనకు బడ్జెట్ కేటాయింపుల్లో 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేసిన వ్యయం
రాష్ట్రం- బడ్జెట్ కేటాయింపుల్లో వ్యయం
1)తెలంగాణ- 60.86 శాతం
2)ఆంధ్రప్రదేశ్- 53.37 శాతం
3)కేరళ- 40.93 శాతం
4)తమిళనాడు- 40.05 శాతం
5)గుజరాత్- 29.64 శాతం
6)కర్ణాటక- 16.87శాతం
4) బాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు- 34 వేలు
సీఎం జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు- 2. 14 లక్షలు
Note:
బాబు దిగిపోతూ అమరావతి పల్లెల్లో 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని చెప్పాడు
ఖజానాలో కేవలం రూ.100 కోట్లు పెట్టి మే 30న దిగిపోయాడు
మరుసటి రోజు జీతాలు పెన్షన్‌లకు ఐదు వేల కోట్లు
ఇతర ఖర్చులకు మూడు వేల కోట్లు, మొత్తం ఎనిమిది వేల కోట్లు కావాలి. అప్పు కోసం రిజర్వ్ బ్యాంకు దగ్గరకు పరిగెత్తాలి అని ఆరోజు పచ్చ పత్రిక రాసింది.
ఇదీ బాబు విజన్ అనుభవం నిర్వాకం!
Comments
Please login to add a commentAdd a comment