గుంటూరు, సాక్షి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరికాసేపట్లో పాత్రికేయ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు.
అమెరికా-అదానీ వ్యవహారంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఇటు కూటమి ప్రభుత్వం, అటు వాళ్ల అనుకూల మీడియా అసత్య ప్రచారాలకు దిగాయి. అదే సమయంలో ఏపీలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి.
ఇక నుంచి మీడియా ద్వారానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించిన వైఎస్ జగన్.. గత సమావేశాల్లో బడ్జెట్‌తో పాటు పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బొంకిందే బొంకుతున్న చంద్రబాబును ‘బొంకుల బాబు’గా అభివర్ణించారాయన.
Comments
Please login to add a commentAdd a comment