
కువైట్‌లో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు
రాజంపేట రూరల్: సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి తీరును నిరసిస్తూ కువైట్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఉమేరియా పార్కులో శనివారం వైఎస్సార్ సీపీ కువైట్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో పార్టీ కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో చౌకబారు రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. దీక్షలో ప్రధాన కోశాధికారి మహేష్ రెడ్డి, మీడియా ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, యూత్ విభాగం ఇన్‌చార్జి మర్రి కళ్యాణ్, బీసీ సెల్ ఇన్‌చార్జి రమణ యాదవ్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షుడు లక్ష్మీ ప్రసాద్, మీడియా ఇన్‌చార్జి సురేష్ రెడ్డి, గోవిందరాజు, నాయకులు హనుమంత రెడ్డి, ఎస్.గంగాధర్, టి.సుబ్రమణ్యం, బాబు యాదవ్, జి.వెంకటేష్, మైనార్టీ నాయకులు రహంతుల్లా, సర్దార్, ఇస్మాయిల్, ముస్తఫా, అఫ్రిన్, అక్బర్, మహబూబ్ బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment