సాక్షి, అమరావతి : చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. గత 12 నెలల్లో ఐదు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న సుమారు 1.22 కోట్ల మందికి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్‌కే) కింద చేపట్టిన ఈ పరీక్షల్లో పలువురు చిన్నారుల్లో లోపాలు గుర్తించారు. వారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు.
ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు గుర్తించి వారికి వయసొచ్చాక ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లు,కళాశాలల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఎక్కువగా పదేళ్లలోపు వయసున్న చిన్నారుల్లోనే సమస్యలు కనిపించాయి.
దేశంలోనే గొప్పగా కంటివెలుగు కార్యక్రమం
చిన్నారులకు వైద్య పరీక్షలే కాదు.. ‘వైఎస్సార్ కంటివెలుగు’లో భాగంగా 66 లక్షలమందికి కంటిపరీక్షలు నిర్వహించారు. ఇందులో సమస్యలున్న 55 వేలమందికి విజన్‌కిట్స్ పంపిణీ చేశారు. 1.58 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. 9,666 మంది చిన్నారులను పెద్దాస్పత్రులకు పంపి చికిత్స చేయించింది. ఎప్పట్నుంచో చిన్నారులు కంటి సమస్యలతో బాధపడుతుండగా నేరుగా స్కూళ్లకే వెళ్లి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇచ్చింది మొదటగా మన రాష్ట్రంలోనే.
ఆర్బీఎస్‌కే కింద పరీక్షల వివరాలు
మొదటి దశలో స్క్రీనింగ్ | 62,83,203 |
పుట్టుకతోనే లోపాలున్నవారు | 46,627 |
శారీరక లోపాలతో ఉన్నవారు | 36,614 |
జబ్బులతో బాధపడుతున్నవారు | 44,288 |
ఎదుగుదలలో లోపాలు | 9,322 |
రెండోదశలో స్క్రీనింగ్ | 59,99,438 |
పుట్టుకతోనే సమస్యలున్నవారు | 10,439 |
రకరకాల శారీరక లోపాలున్నవారు | 8,921 |
జబ్బులతో బాధపడుతున్నవారు | 54,548 |
ఎదుగుదల లోపాలున్నవారు | 30,084 |
వైఎస్సార్ కంటివెలుగు కింద
మొత్తం స్కూళ్లు | 60,406 |
స్క్రీనింగ్ చేయించుకున్న విద్యార్థులు | 66 లక్షలు |
అద్దాలు తీసుకున్నవారు | 1.58 లక్షలు |
పెద్దాస్పత్రులకు సిఫార్సు | 9,666 |
విజన్‌కిట్‌లు తీసుకున్నవారు | 55,000 |
Comments
Please login to add a commentAdd a comment