![YSRCP MLA Merugu Nagarjuna Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/25/Merugu-Nagarjuna.jpg.webp?itok=sMohHjHd)
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు.. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. 300 ఎకరాల దళితుల భూములను కాజేయడానికి ప్లాన్ చేశారని.. చంద్రబాబు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తారంటూ ఆయన దుయ్యబట్టారు.
దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకున్నారని.. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని మేరుగ నాగార్జున విమర్శించారు. రాజధాని ప్రాంతంలో 54 వేల మంది దళితులకు ఇళ్లపట్టాలు ఇస్తామంటే.. కోర్టుకు వెళతారా..? అని ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబు మరో బాగోతం బయటకు రానుందన్నారు. అన్నీ ఆధారాలతో ఆయన దొంగ చేష్టలు బయటకు రానున్నాయని పేర్కొన్నారు. దళిత పక్షపాతిగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.
చదవండి:
ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి
‘అక్కడ జరిగింది.. నూటికి నూరు శాతం అక్రమాలే’
Comments
Please login to add a commentAdd a comment