మదనపల్లె సిటీ : వృద్ధాప్యం శాపం కావొద్దు. ఆరోగ్యపరమైన అవరోధాలకులోనవ్వొదు. నిత్య నూతనంగా, ఉత్సాహంగా జీవనం కొనసాగాలి. పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి తీర్చిదిద్దుకోవాలి. పిల్లలు వయసు పైబడిన తల్లి దండ్రుల పట్ల ఆత్మీయంగా మెలగాలి. ఆసరాగా నిలవాలి. వెన్నుదన్నుగా మారాలి. భారంగా భావించి వారిని వృద్ధాశ్రమాల వైపు కాకుండా ఇంట్లోనే గుండెల్లో పెట్టి చూసుకోవాలి. వారికి మలిదశ మహానందంగా సాగేలా తోడ్పాటునందించాలి.
’చేరదీయండి...చెంతకు వెళ్లండి..
ఉద్యోగ,ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నా సొంతూరిలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. సెలవులొచ్చినపుడు వీలు దొరికినప్పుడల్లా ఊళ్లో ఉన్న అమ్మా,నాన్నల దగ్గరికి వెళ్లాలి. ఏళ్ల తరబడి పెద్దవారికి కనిపించకుంటే చెప్పుకోలేని బాధ వారిని గుండెకోతకు గురి చేస్తుంది. ఒంటరిగా ఉన్నామన్న భావన రాకుండా ఆ పండుటాకుల పట్ల ప్రేమతో మెలగాలి. మనవలు, మనవరాళ్లు వారి చెంతకొస్తే ఎంతో సంతోషపడతారు. చిన్నపిల్లలను పెద్ద మనుషుల దగ్గరకు తీసుకెళ్లే వారి జీవితానుభవసారం రంగరించి మంచి, చెడు,తపొప్పులు నేర్పుతారు. సమాజం పట్ల బాధ్యతగా మెలిగే పౌరులుగా ఎదుగుతారు.
ఆ అనుభూతీ మధురమే
మనిషి జీవిత చక్రంలో బాల్యం,యవ్వనం లాగే వృద్ధాప్యమూ ఒక దశ. ఆ అనుభవాలను నెమరేసుకుంటూ ఈ దశలో సంతోషించాల్సిందే. వయోభారం కేవలం శరీరానికే తప్ప, మనసుకు కాదని భావిస్తే యువతరానికి ధీటుగా నిలవొచ్చు.
ఈ పెద్దలు జ్ఞాన పెన్నిధులు
నిన్న విరిసిన పువ్వు నేటికి వాడిపోతుంది. దాని పరిమళమూ విరిగిపోతుంది. అది ప్రకృతి సహజం. కానీ ప్రకృతిని ధిక్కరించి ధీరులెందరో మన చుట్టూ ఉన్నారు. వారి ప్రతిభ కాలతీతంగా గుబాళిస్తుంది. వృద్ధాప్యంవారి ముందు చిన్నబోతుంది. వారిలో కొందరు సీనియర్ సిటిజెన్స్ గురించి..
Comments
Please login to add a commentAdd a comment