
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.8.32 వరకు, తదుపరి త్రయోదశి తె.5.47 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.47 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.7.47 నుండి 9.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు, అమృత ఘడియలు: తె.4.46 నుండి 6.16 వరకు. యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం : 6.00, సూర్యాస్తమయం: 5.30.
మేషం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార,ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.
వృషభం... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలం.
మిథునం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
సింహం.... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య.... చేపట్టిన పనులు సాఫీగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల.... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో విజయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
వృశ్చికం... మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు... పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగావకాశాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కుంభం.. బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం... విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపార,ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment