
పాస్టర్ మృతిపై విచారణకు డిమాండ్
వేటపాలెం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ చార్లెస్ ఫీన్నీ డిమాండ్ చేశారు. ఆదివారం వేటపాలెం క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆధ్వర్యంలో వందల మందితో దేశాయిపేట నుంచి వేటపాలెం గడియార స్తంభం సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఒక్క ప్రవీణ్‌ను చంపితే వందలాది మంది ప్రవీణ్‌లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అన్నాలదాసు భాస్కర్‌రావు, పాస్టర్ సత్యంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రగోరి, మండల దైవ సేవకులు, మహిళలు పాల్గొన్నారు.
భారీ ర్యాలీకి తరలివచ్చిన
వందల మంది క్రైస్తవులు