
రంగస్థలంపై సీ్త్ర కాంతులు
● చింతామణిలో శ్రీహరి పాత్రతో మన్ననలు ● తాత స్ఫూర్తితో చిన్ననాటి నుంచే ప్రతిభ ● ఇప్పటివరకు 4,500కుపైగా ప్రదర్శనలు ● రెండు లఘుచిత్రాలతో మరింత గుర్తింపు ● నటనలో యువకుడు శ్రీకాంత్ సత్తా
పట్టణంలోని నంబూరిపాలెంకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, జెమినీ సంస్థలో పనిచేసిన అద్దంకి మాణిక్యాలరావు మనవడు శ్రీకాంత్. ఆయన తండ్రి పేరు హనుమంతరావు. ఈయన కూడా నటుడే. తల్లి మేరి భారతి. శ్రీకాంత్ తన నాలుగో ఏటే సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహతాసుడు వేషం ధరించారు. చింతామణి నాటకంలోని శ్రీహరిగా, సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు, కాలకౌశకుడు, వీరబాహు, లక్ష్మి తిరుపతమ్మ నాటకంలో భృగుమహర్షి, తిప్పడు, బ్రాహ్మణుడు, మలయ్య, వెంగమాంబ తదితర పాత్రలు పోషించారు. పౌరాణిక, జానపద నాటకాలే కాకుండా శిలువధారి, శాంసన్ డెలీల, బ్రహ్మం గారి నాటకాలలోనూ ప్రతిభ చూపారు.
ప్రదర్శనలు..
ఇప్పటివరకు 4,500కుపైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రెండు లఘు చిత్రాలలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమైన ఆంధ్రా యూనివర్సిటీ – విశాఖపట్నం, కాలికట్ యూనివర్సిటీ – కేరళ, బళ్లారి రాఘవ కళాక్షేత్రం – కర్నాటక, రవీంద్రభారతి – హైదారబాద్, విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రం వంటి వేదికలపై తన ప్రదర్శనలతో పేరొందారు. ప్రముఖ రంగస్థల నటుడు చీమకుర్తి నాగేశ్వరరావు, విజయ్‌రాజు, తన తల్లి మేరీ భారతితో కలిసి నటించారు.
అద్దంకిలో కళాకారులకు కొదువలేదు. బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు నాడు రంగస్థలంపై తమ నటనతో అలరించారు. నేటి తరం నటులు ఎందరో ఉన్నారు. ఆ కోవలో తన తాత అద్దంకి మాణిక్యాలరావును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు శ్రీకాంత్. చింతామణిలో సీ్త్ర పాత్రయిన శ్రీహరిగా ప్రతిభ చాటుతున్నారు. – అద్దంకి
ఎన్నో సత్కారాలు
శ్రీకాంత్ ఇప్పటివరకు దాదాపు 500కుపైగా సన్మానాలు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అప్పటి మంత్రి పార్థసారథిచే ప్రముఖ రంగస్థల నుడు రేబాల రమణ పురస్కారం, నాటక కిశోర బిరుదు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో అక్కడి కలెక్టర్ నుంచి సన్మానం పొందారు. సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణితో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్నారు. గానగంధర్వ, అభినవ శ్రీహరి, రంగస్థల సకల పాత్ర వల్లభుడు అనే బిరుదులు పొందారు.

రంగస్థలంపై సీ్త్ర కాంతులు

రంగస్థలంపై సీ్త్ర కాంతులు

రంగస్థలంపై సీ్త్ర కాంతులు