బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Fri, Apr 11 2025 1:34 AM | Last Updated on Fri, Apr 11 2025 1:34 AM

బాపట్

బాపట్ల

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
అనుమతులు ఉన్నా..

7

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 515.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.

వైద్యశాలలో అన్నదానం

మాచర్లరూరల్‌: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం అన్నదానం నిర్వహించారు. కన్వీనర్‌ జక్కా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శిలువ పాదయాత్ర

నాదెండ్ల: కనపర్రు గ్రామంలో తపస్సు కాలం సందర్భంగా గురువారం మరియ, యేసోబు దేవాలయం నుంచి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు విశ్వాసులు శిలువ పాదయాత్ర నిర్వహించారు.

సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి పాలనలో కొందరు పోలీసు అధికారులు మరింతగా రెచ్చిపోతున్నారు. అధికారపార్టీ నేతల అండచూసుకొని పెట్రేగిపోతునారు. ఖాకీ చొక్కాలపై పచ్చకండువాలు కప్పుకొని విర్రవీగుతున్నారు. నిన్న అనంతపురం జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే నోరుపారేసుకుంటే తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ ఎస్‌ఐగా సోమవారం విధుల్లో చేరిన నాగరాజు వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసు స్టేషన్‌ ఆవరణలోకి కూడా రావద్దంటూ హుకుం జారీ చేశారు. పబ్లిక్‌ సర్వెంట్‌గా వున్న ఎస్‌ఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా వారు స్పందించడంలేదు. ఎస్‌ఐ తీరుతో బల్లికురవ ప్రాంతంలో మళ్లీ ఫ్యాక్షన్‌ గొడవలు తలెత్తే ప్రమాదముందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వేమవరం హత్యకేసు రాజీ కోసమే..

ఇదే మండలం వేమవరంలో 2017లో మేనెల 18న కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులు గోరంట్ల అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అనుచరులు 13 మంది కలిసి పథకం ప్రకారం హత్యచేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ దాడిలో గోరంట్ల వెంకటేశ్వర్లు, వేగినేని వీరరాఘవయ్య తీవ్ర కత్తిపోట్లకు గురై కొన ప్రాణంతో బయటపడ్డారు. ఆరోజు నుంచి ఈ రోజువరకూ వేమవరంలో పోలీసు పికెట్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం కేసు చివరిదశకు చేరుకుంది. బాధితులు హత్యచేసిన వారికి శిక్ష పడాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మంత్రి గొట్టిపాటి అనుచరులకు శిక్షపడే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ కేసులో బాధితులను బెదిరించైనా సరే బయట పడేందుకు మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే 2017 ప్రాంతంలో బల్లికురవ ఎస్‌ఐగా పనిచేసిన నాగరాజును తిరిగి ముండ్లమూరు నుంచి హుటాహుటిన బల్లికురవ స్టేషన్‌కు పిలిపించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

నక్కబొక్కలపాడు వద్ద పచ్చపార్టీ జెండాలతో ప్రభల ఏర్పాటు

న్యూస్‌రీల్‌

ఆది నుంచి వివాదాస్పదమే..

బల్లికురవ ఎస్‌ఐ నాగరాజు పనితీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. సోమవారం ఆయన మరోమారు బల్లికురవ ఎస్‌ఐగా విధుల్లో చేరీచేరడంతోనే వైఎస్సార్‌ సీపీ శ్రేణులే టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారు. మండలంలోని నక్కబొక్కలపాడులో ఈర్ల గంగమ్మ జాతర సందర్భంగా ప్రభల అనుమతుల విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 12న జాతర వున్నా గురువారం నుంచే ఈ ప్రాంతంలోని నక్కబొక్కలపాడుతోపాటు కొనిదెన, మల్లాయిపాలెం తదితర గ్రామాల్లో తిరునాళ్లు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రభలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ప్రభలు కట్టుకునేందుకు ఇరుపార్టీ మద్దతు దారులు అనుమతికోసం పోలీసులకు దరఖాస్తుచేయగా పచ్చపార్టీ వారికి 6 ప్రభల ఏర్పాటుకు అనుమతులిచ్చిన ఎస్‌ఐ నాగరాజు వైఎస్సార్‌ సీపీ వారికి అనుమతి నిరాకరించారు. ఇక నుంచి స్టేషన్‌లోకి రావద్దని వైఎస్సార్‌ సీపీ వారికి హుకుం జారీ చేశారు. మీరు ఎవరికి చెప్పుకున్నా అనుమతి ఇచ్చేదిలేదన్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకుడు కృష్ణ తదితరులు బాపట్ల డీఎస్పీని కలిసి విషయం చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులపై వివక్ష

బల్లికురవ మండలంలో ఈర్లగంగమ్మ తిరునాళ్ల

ప్రభలు పెట్టుకునేందుకు అనుమతి కోరిన ఇరుపార్టీల నేతలు

పచ్చపార్టీ వారికే అనుమతులిచ్చిన ఎస్‌ఐ నాగరాజు

ఎస్‌ఐ మాటే మా మాట అంటున్న ఉన్నతాధికారులు

నాలుగు రోజులముందు అనుమతి ఇచ్చి బదిలీపై వెళ్లిన ఎస్‌ఐ

నాగరాజు విధుల్లో చేరగానే అనుమతి రద్దు

ఎస్‌ఐ నాగరాజును హుటాహుటిన

బల్లికురవకు తెచ్చిన మంత్రి అనుచరులు

వేమవరం జంటహత్యల కేసు రాజీ కోసమేనన్న ప్రచారం

గతంలో బల్లికురవ ఎస్‌ఐగా పనిచేసిన నాగరాజు

వాస్తవానికి వైఎస్సార్‌ సీపీ నేతలు వారం క్రితం బల్లికురవ ఎస్‌ఐ జీవీ చౌదరికి దరఖాస్తు చేసుకోగా ఆయన సంతమాగులూరు సీఐ కలిసి ప్రభలకోసం అనుమతి ఇచ్చారు. ఈ విషయం డీఎస్పీకి సైతం తెలుసు. ఇదే విషయాన్ని వైఎస్సార్‌ సీపీ నేతలు డీఎస్పీ దృష్టికి తీసుకరాగా అనుమతి తాను పంపిస్తానని ఎస్‌ఐని కలువాలని చెప్పడంతో వారు తిరిగి బల్లికురవ ఎస్‌ఐని కలువగా ఎవరు చెప్పినా అనుమతి ఇవ్వనని తేల్చి చెప్పారు. మంత్రి అనుచరుల అండతో ఎస్‌ఐ డీఎస్పీ మాటలను సైతం ఖాతరు చేయలేదని తెలుస్తోంది. దీంతో గురువారం సైతం వైఎస్సార్‌ సీపీ నేతలు మరోమారు డీఎస్పీని కలువగా తాను ఎస్‌ఐ చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పడం అందరినీ నివ్వెరపరిచింది. అదే సమయంలో పార్టీలు, జెండాలకతీతంగా తిరునాళ్లు నిర్వహించుకోవాలని, పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు కడితే కేసులు పెడతామని చెప్పినా పచ్చపార్టీవారు మాత్రం ప్రభల ప్రాంతంలో ఏకంగా టీడీపీ జెండాలు, నేతల ఫొటోలు ఏర్పాటు చేశారు. పచ్చపార్టీ వారికి మాత్రమే ఎస్‌ఐ అనుమతులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాపట్ల1
1/7

బాపట్ల

బాపట్ల2
2/7

బాపట్ల

బాపట్ల3
3/7

బాపట్ల

బాపట్ల4
4/7

బాపట్ల

బాపట్ల5
5/7

బాపట్ల

బాపట్ల6
6/7

బాపట్ల

బాపట్ల7
7/7

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement