
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చీరాల: బాపట్ల జిల్లాలో తీరం మణిహారంగా మారనుంది. జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాలలోని రామాపురం బీచ్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జూలై చివరకల్లా ఈ రెండు బీచ్‌ల్లో బోటింగ్ షికారుకు ప్రైవేటు భాగస్వామ్యంతో క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకట మురళి వెల్లడించారు. దీంతో ఈ రెండు బీచ్‌లు అబ్ధివృద్ధి చెందితే మినీ గోవాగా మారనున్నాయి. ఇప్పటికే వాడరేవు నుంచి కఠారిపాలెం వరకు ఉన్న తీరప్రాంత రోడ్డు డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. ఈ రెండు బీచ్‌ల్లో సుమారు 50కి పైగా రిసార్ట్‌లు ఉన్నాయి. సీఆర్‌జడ్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యావరణానికి ఎలాంటి హానీ, కాలుష్యం లేని ప్రాంతంగా ఈ రెండు బీచ్‌లను ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇరవై మంది శాస్త్రవేత్తలు ఈ రెండు బీచ్‌ల్లో పర్యటించి అధ్యయనం చేశారు. పరిశుభ్రమైన ప్రాంతంగా జిల్లాలో ఈ రెండు బీచ్‌లే ఉన్నాయన్నారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చీరాల కేంద్రంగా జీడిపప్పు ఉత్పత్తి అధికంగా ఉన్నందున విక్రయాలు, ఉత్పత్తులను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాటిచెట్లు ఆధారంగా ఉత్పత్తులు పెంచేలా కల్లుగీత కార్మికులకు, బోటింగ్ షికారు జరిగేలా మత్య్సకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. చీరాలలో అధికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తుల పెంపు, ప్రదర్శన, అమ్మకాల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. వాడరేవు వద్ద రెవెన్యూ అసోసియేషన్‌కు చెందిన ఒక ఎకరం భూమిని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి ఈ భూమిని లీజుకు ఇవ్వడానికి పరిశీలన జరుగుతున్నాయన్నారు. పేరలి కెనాల్ బోటింగ్‌కు అనుకూల ప్రాంతంగా గుర్తించారు. అత్యవసరమైన అభివృద్ధి పనులకు గాను రూ.1.13 కోట్లు నిధులు కేటాయించారు.
న్యూస్‌రీల్
సూర్యలంక, రామాపురం బీచ్‌ల్లో బోటింగ్ క్లబ్‌లు ఏర్పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళికలు రెండు బీచ్‌లపై అధ్యయనాలు పూర్తి

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025