
వైఎస్సార్ సీపీ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడుగా
రేపల్లె రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షుడుగా రేపల్లెకు చెందిన కర్రా జాష్ రత్నాకర్ నియమితులయ్యారు. రత్నాకర్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. రత్నాకర్‌కు నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. రత్నాకర్ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎన్‌ఓ ఉన్నత పాఠశాలకు వాచ్‌మన్ నియామకం
కారంచేడు: కారంచేడు గ్రామంలో 1956వ సంవత్సరం నుంచి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన యార్లగడ్డ నాయుడమ్మ ఓరిఎంటల్ (కం) ఉన్నత పాఠశాల పునః ప్రారంభానికి సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా పాఠశాలకు వాచ్‌మన్ నియామక ఉత్తర్వులను ఒంగోలు డీఈఓ ఏ కిరణ్‌కుమార్ విడుదల చేశారు. గతంలో ఇదే పాఠశాలలో విధులు నిర్వహించిన టీ ఏడుకొండలును పాఠశాల మూతపడటంతో ప్రకాశం జిల్లా మైనంపాడు ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. ఇప్పుడు మరలా పాఠశాల పునఃప్రారంభానికి సిద్ధమవ్వడంతో మొదటగా వాచ్‌మన్ నియామం చేపట్టడంతో గ్రామస్తుల్లో పాఠశాల పునః ప్రారంభంపై నమ్మకం ఏర్పడింది. ఇక నుండి పాఠశాలలో విద్యార్థులు చేరడానికి అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఆపై అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపడతారు.కారంచేడు గ్రామంలో ఉన్నత పాఠశాల పునః ప్రారంభం కానుండటంతో మంచి రోజులు వస్తున్నాయని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.
భూమిలో పోషకాలు పెంపొందించుకోవాలి
భట్టిప్రోలు (కొల్లూరు): భూమిలో సారం పెంచుకొని పోషక విలువలు పెంపొందిచుకోవడంపై రైతులు దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎంయు వాణిశ్రీ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐలవరంలో ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 27 రకాల విత్తనాలను కలుపుకొని భూమిలో చల్లుకోవడం ద్వారా భూమికి బలాన్ని అందించే పోషకాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పీఎండీఎస్ విత్తనాలను కిట్‌లను సిద్ధం చేసి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ నీలం ప్రకాష్‌కుమార్, అడిషనల్ డీపీ మోహన్, ఎన్‌ఎఫ్‌ఏ వర్ధనమ్మ, యూనిట్ ఇన్‌చార్జి ఐసీఆర్. పీస్ పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడుగా