కొత్తగూడెంఅర్బన్: విద్యార్థుల్లో మౌలిక భాష, గణిత అభివృద్ధి ప్రక్రియ ద్వారా సాధించిన ఫలితాలను అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ శాంపిల్ సర్వే చేస్తున్నట్లు సర్వే సమన్వయకర్త, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో సర్వే ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే 55 మంది క్షేత్ర పరిశీలకులను గుర్తించి 6వ తేదీ నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా రెండో తరగతి విద్యార్థుల్లో తెలుగు, ఇంగిష్, గణితం సబ్జెక్టులో సామర్థ్యాలను పరిశీలించి ఒక అంచనాకు వస్తారని, ఈ సర్వే మొత్తం ‘టాన్జరిన్‘ అనే మొబైల్ యాప్ ద్వారా జరుగుతుందని వివరించారు. ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రత్యేక విధానం ద్వారా ఎనమిది మంది పిల్లలను గుర్తించి, వారికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment