విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
పాల్వంచరూరల్: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఐదు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో వాలీబాల్ పోటీలో పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రథమ, షటిల్ పోటీలో బాలురు ప్రథమ, బాలికలు ద్వితీయ, అథ్లెటిక్స్ పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బహుమతులతో పాటు ధ్రువీకరణపత్రాలు అందించి మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఎంప్లాయ్‌మెంట్ అధికారి శ్రీరామ్, నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.భానుచందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జాగృతి యూత్ అసోసియేషన్ సభ్యులు సయ్యాద్ ఫరూక్, యూత్ క్లబ్ అధ్యక్షులు మురళికృష్ణ, బానోతు వెంకట్‌లు పాల్గొన్నారు.