
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు
కారేపల్లి: సిగ్నల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. కారేపల్లిలోని ఇల్లెందు, పేరుపల్లి రైల్వే గేట్ల వద్ద గూడ్స్ రైలు నిలిచిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం నుంచి వయా కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా డోర్నకల్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఇల్లెందు (2కేకే) రైల్వే గేట్, పేరుపల్లి (1కేకే) రైల్వే గేట్‌లకు సమీపించి సిగ్నల్స్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ఈ రెండు గేట్లు తెరుచుకోకపోవటంతో సుమారు గంట పాటు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా.. ఈ రెండు రైల్వే గేట్లకు రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి లేదా అండర్ లోలెవల్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రజా ప్రతినిధులను, రైల్వే ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇల్లెందు, పేరుపల్లి రైల్వే గేట్ల వద్ద
ఇబ్బందులు పడిన వాహనదారులు