
న్యూఢిల్లీ: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్‌టెల్ శుభవార్త అందించింది. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్‌వర్క్‌లోని తక్కువ-ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ.49 ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. రూ.49 ప్యాక్ కింద 100 ఎంబి డేటా, 38 విలువైన టాక్ టైమ్ రూ.28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో క్లిష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడనున్నట్లు పేర్కొంది.
అలాగే, ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం ఉందని గ్రహించిన ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఈ కూపన్ల వల్ల క్లిష్ట సమయాల్లో వారి కుటుంబంతో కనెక్ట్ అవ్వొచ్చని పేర్కొంది. ఈ రెండు ప్రయోజనాలు రాబోయే వారం రోజుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని 18 దేశాలలో 45.8 కోట్లకు పైగా కస్టమర్లు కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఎయిర్‌టెల్ ఒకటి. ఇది ఆఫ్రికన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్. ప్రస్తుతం మనదేశంలో భారతీ ఎయిర్‌టెల్‌కు 34కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment