
ఇజ్రాయిల్ ఎన్‌ఎస్‌వోకు చెందిన పెగాసస్ మాల్‌వేర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ మాల్‌వేర్‌తో పలు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఇతరులపై గూఢాచర్యం నిర్వహించినట్లుగా పలు ఆంగ్ల దినపత్రికల దర్యాప్తులో తేలింది. తాజాగా అంతర్జాతీయ మానవ హక్కుల ఎన్జీవో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరో బాంబును పేల్చింది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్న ఐఫోన్‌లు జీరో-క్లిక్ ఐమెసేజ్‌స్‌తో పెగాసస్ మాల్‌వేర్ చొరబడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పలు ఐఫోన్‌ల లాగ్‌లను విశ్లేషించగా పలు భయంకర నిజాలు బయటకు వచ్చాయి. 2014 జూలై 14 నుంచి పలు ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లను పెగాసస్ స్పైవేర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2021 జూలైలో కూడా ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లపై గూఢాచర్యం చేసినట్లు ఎన్జీవో గుర్తించింది.
మీరు ఐఫోన్ యూజర్ల..ఐతే జరభద్రం..!
పెగాసస్ స్పైవేర్ ప్రస్తుత ఐఫోన్లలో నడుస్తున్న ఐవోఎస్ 14.6 వర్షన్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లుగా తాజా నివేదికలో తేలింది. అత్యంత భద్రత కల్గిన ఐఫోన్లను సింపుల్‌గా యూజర్ల ఎటువంటి చర్య లేకుండా పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి iMessageను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఆపిల్ కంపెనీ తన తదుపరి ఐవోస్ 14.7 వర్షన్‌ను మరికొద్ది రోజుల్లో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న బగ్‌ను గుర్తించడంలో ఆపిల్ విజయవంతమౌతుందనీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment