
Anand Mahindra: వ్యక్తిగత జీవితమైనా వ్యాపారమైనా ఎత్తు పల్లాలు సహాజం. కానీ కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు.. ఆ విపత్కర పరిస్థితులను ఎలా అధిగమించామన్నది ఎంతో కీలకం. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపార రంగంలో ఉన్న వారు నిరంతరం ఒడిదుడుకుల మార్గంలో పయణిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తనకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే ఓ వీడియోను మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో ఓ చిన్నారి గోడను ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతీ కదలిక కష్టంగా ఉంటుంది. అయినా సరే చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ చిన్నారి.. చివరకు గోడను ఎక్కేస్తుంది.
This video is from a couple of years ago, but I don’t think it will ever be ‘dated.’ I like to put it on every now & then, especially when some personal or business goal is looking intimidating or impossible! All my fears vanish instantly… pic.twitter.com/9XtuyBVxwJ
— anand mahindra (@anandmahindra) November 8, 2021
ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా ‘ ఈ వీడియో రెండేళ్ల కిందటిది. కానీ ఇది అవుట్‌డేడెట్ అనుకోవడం లేదు. చాలా తరచుగా ఈ వీడియోను నేను చూస్తుంటాను. ముఖ్యంగా వ్యక్తిగతంగా, బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు.. ఈ పని చేయలేం.. అసాధ్యం అనిపించినప్పుడు తప్పకుండా చూస్తాను. వెంటనే నా భయాలన్నీ మాయం అవుతాయి’ అంటు చెప్పుకొచ్చారు.