ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ శుభవార్త చెప్పింది. ఇకపై ఐఫోన్ వినియోగదారులు వారి ఫోన్‌లను వారే రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ సెల్ఫ్ సర్వీస్ స్కీమ్‌ను ప్రారంభించనుంది.
యూఎస్, యూకే దేశాల్లో వినియోగదారులు వాషింగ్ మెషిన్,టీవీ, ఫ్రిడ్జ్‌లు, ఫోన్‌లు ఇలా.. ఏదైనా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు చెడిపోతే సొంతంగా రిపేర్ చేసే అధికారం లేదు. ప్రొడక్ట్ చెడిపోయిందంటే సర్వీస్ సెంటర్‌కు తీసుకొని వెళ్లాల్సిందే. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున రైట్-టూ రిపేర్ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంతో దిగొచ్చిన యూకే ఈ ఏడాది జులై నెలలో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు వినియోగదారులు రిపేర్ చేసుకోవచ్చంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. వారం రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అదే చట్టాన్ని దేశంలో అమలు చేసేలా ప్రణాళికల‍్ని సిద్ధం చేయాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ftc)కి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2022లో ప్రారంభం కానున్న ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ వినియోగదారులు,5వేల మంది యాపిల్ ఆథరైర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు, 2,800మంది వినియోగదారులు ఈ స్కీమ్‌లో పాల‍్గొనవచ్చని యాపిల్ వెల్లడించింది.
'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'తో లాభాలేంటి?
యాపిల్ ప్రారంభించనున్న ఈ 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్' వల్ల యాపిల్ ప్రొడక్ట్‌లను రిపేర్ చేయొచ్చు. సొంతంగా ఉపాధిని పొందవచ్చు. యాపిల్ సంస్థకు కొన్ని దేశాల్లో సొంత సర్వీస్ సెంటర్లు లేవు. థర్డ్ పార్టీ సంస్థల నుంచి యాపిల్ ప్రొడక్ట్ అమ్మకాలు, సర్వీసులు జరుగుతాయి. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటలలో ప్రొడక్ట్ రిపేర్ చేయించాలంటే తడిసి మోపెడవుతుంది. అయితే యాపిల్ ప్రొగ్రాంతో సర్వీస్ ఖర్చు తగ్గిపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment