వచ్చే జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. కారణం రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా దాదాపు 15 రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవులు ప్రకటించింది. నెలలో మొదటి, మూడో శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవులు, రాష్ట్రాలు నిర్దేశించిన ప్రకారం స్థానిక సెలవు దినాలలో బ్యాంకులు పనిచేయవు.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే అనే మూడు కేటగిరీల కింద ఆర్బీఐ సాధారణంగా ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది.
వచ్చే జూలైలో మొదటి సెలవు జూలై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజుతో ప్రారంభమవుతుంది. జూలై 29న మొహర్రం వంటి తదుపరి సెలవుల వరకు కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలు మినహా ఈ సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి.
జూలై నెల బ్యాంకు సెలవులు ఇవే..
- జూలై 4: ఆదివారం
- జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్)
- జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే (MHIP Day) (మిజోరాం)
- జూలై 8: రెండో శనివారం
- జూలై 9: ఆదివారం
- జూలై 11: కేర్ పూజ (త్రిపుర)
- జూలై 13: భాను జయంతి (సిక్కిం)
- జూలై 16: ఆదివారం
- జూలై 17: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయ)
- జూలై 22: నాలుగో శనివారం
- జూలై 23: ఆదివారం
- జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో)
- జూలై 30: ఆదివారం
- జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్)
ఇదీ చదవండి: ఎల్‌ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
Comments
Please login to add a commentAdd a comment