july month
-
ఈపీఎఫ్‌వోలో 18.75 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. ఈఎస్ఐ కిందకు 19.88 లక్షల మంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈఎస్ఐ కింద నమోదు చేసుకున్నారు. -
ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి?
జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభమైంది. ఎప్పటి నుంచో పొడించుకుంటూ వస్తున్న ఆధార్-పాన్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీతో ముగిసిపోయింది. ఇక పొడిగింపు ఉండదని ఆదాయపు పన్న శాఖ తేల్చి చెప్పేసింది. అయితే జూలై నెలలో పూర్తి చేయాల్సిన ఫినాన్సియల్ డెడ్లైన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఐటీఆర్ దాఖలు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) సమర్పించడానికి జూలై 31 ఆఖరు తేదీ. గడువు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందడం సహజం. అయితే ఫారమ్ 16, 26AS, వార్షిక సమాచార స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వడ్డీ, మూలధన లాభాల స్టేట్మెంట్ వంటి అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం, తరచుగా చేసే సాధారణ తప్పుల గురించి తెలుసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులువుగా పూర్తి చేయవచ్చు. చివరి నిమిషంలో హడావుడి తప్పులకు దారితీస్తుంది.ఆదాయపు పన్ను రిటర్న్‌ను సంబంధిత డాక్యుమెంట్లు జోడించకుండా ఫైల్ చేయడం వలన తక్కువ రిపోర్టింగ్‌కు దారి తీయవచ్చు. దీనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే ఆఖరు వరకు వేచి ఉండకుండా కాస్త ముందుగానే ఐటీఆర్ ఫైల్ ఉత్తమం. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువును జూలై 11 వరకు పొడిగించింది. అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్లను ఆన్లైన్ ద్వారా ఎంచుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉద్యోగి UAN, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వంటి నిర్దిష్ట వివరాలను అందించాలి. దరఖాస్తు ధ్రువీకరణ కోసం ఉద్యోగి ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. ధ్రువీకరణ ప్రక్రియ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలు, చందా సమాచారంతో కూడిన మునుపటి క్రియాశీల పీఎఫ్ లేదా పెన్షన్ ఖాతాల గురించిన సమాచారాన్ని అందించాల్సిన అప్లికేషన్ తదుపరి పేజీకి వెళ్తారు. ఇక్కడ సమాచారంతో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం పూర్తయ్యాక ఒక రసీదు సంఖ్య వస్తుంది. దాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం దాచుకోవాలి. అధిక పెన్షన్ దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఈపీఎఫ్‌వో లింక్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: కోటికి పైగా ఐటీఆర్‌లు దాఖలు.. గతేడాది కంటే చాలా వేగంగా.. -
జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు సెలవులే!
వచ్చే జూలై నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు పనిచేయవు. కారణం రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా దాదాపు 15 రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవులు ప్రకటించింది. నెలలో మొదటి, మూడో శనివారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవులు, రాష్ట్రాలు నిర్దేశించిన ప్రకారం స్థానిక సెలవు దినాలలో బ్యాంకులు పనిచేయవు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే అనే మూడు కేటగిరీల కింద ఆర్బీఐ సాధారణంగా ప్రతి సంవత్సరం బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంది. వచ్చే జూలైలో మొదటి సెలవు జూలై 5న గురు హరగోవింద్ జీ పుట్టినరోజుతో ప్రారంభమవుతుంది. జూలై 29న మొహర్రం వంటి తదుపరి సెలవుల వరకు కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాలు మినహా ఈ సెలవులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి. జూలై నెల బ్యాంకు సెలవులు ఇవే.. జూలై 4: ఆదివారం జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్) జూలై 6: ఎంహెచ్ఐపీ డే (MHIP Day) (మిజోరాం) జూలై 8: రెండో శనివారం జూలై 9: ఆదివారం జూలై 11: కేర్ పూజ (త్రిపుర) జూలై 13: భాను జయంతి (సిక్కిం) జూలై 16: ఆదివారం జూలై 17: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయ) జూలై 22: నాలుగో శనివారం జూలై 23: ఆదివారం జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో) జూలై 30: ఆదివారం జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్) ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా -
అత్యంత వేడి మాసం జూలై
వాషింగ్టన్: భూ గ్రహ చరిత్రలోనే ఈ ఏడాది జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్వోఏఏ) కూడా గురువారం ధ్రువీకరించింది. ‘ప్రపంచంలోని అనేక చోట్ల జూలై నెలలో ఎన్నడూ లేనంత వేడిగా వాతావరణం ఉంది. భూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల 2019 జూలై. ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోనూ మంచు భారీగా కరిగింది’ అని ఎన్వోఏఏ తెలిపింది. ఆ వివరాల ప్రకారం, 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా ఈ జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదవడం గమనార్హం. ఇక ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా ఈ ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది. -
జూలైకి ‘పురుషోత్తపట్నం’ పూర్తి
పురుషోత్తపట్నం (సీతానగరం): 2017 జూలై నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పోలవరం ఎడమకాలువ ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. శుక్రవారం పురుషోత్తపట్నం పథకం నెలకొల్పే స్థలాన్ని ఆయన, ఈఈ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పథకంలో పది మోటార్లతో అయిదు పైప్‌లై¯ŒSలు పది కిలోమీటర్లు పొడవునా వెళతాయన్నారు. 240 ఎకరాల భూసేకరణ సేకరించాలని, అందులో ప్రభుత్వ భూమి ఎంత, రైతుల భూమి ఎంత అనేది నిర్ధారించవలసి ఉందన్నారు. రైతుల నుంచి తీసుకునే భూమికి నష్టపరిహారమా లేదా లీజు అనేది వారి సూచనల మేరకు ఉంటుందన్నారు. 58 కిలోమీటర్లు ఏలేరు రిజర్వాయర్ వరకు పోలవరం ఎడమ కాలువ పనులు మూడు ప్యాకేజీలుగా జరుగుతున్నాయన్నారు. రెండు, మూడు ప్యాకేజీ పనులు పూర్తి అయ్యాయని, ఒకటవ ప్యాకేజీలో 7 లేదా 8 స్ట్రక్చర్స్ ఉన్నాయని, వాటిని జూలై నాటికి పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్‌లో నీటిని పంపిస్తామన్నారు. 2017నాటికి ఏలేరు పరిధిలో 53 వేల ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న 23 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, 2018 నాటికి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఏలేరు రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఈ పథకం ద్వారా రెండు పంటలకు నీరు అందించవచ్చన్నారు. 225–11 విద్యుత్ సబ్‌స్టేçÙ¯ŒS నెలకొల్పి పురుషోత్తపట్నం, పుష్కర పథకాలకు పుష్కలంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సుమారు రూ.1,450 కోట్లతో నెలకొల్పే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని సుగుణాకరరావు తెలిపారు.